కామారెడ్డి జిల్లా మండలంలోని తిమ్మకపల్లి గ్రామంలో ఆదివారం మొక్కజొన్న పంటలకు అడవి పందులు తీవ్ర నష్టం కలిగించాయి. ఈరోజు మధ్యాహ్నం దేవరశెట్టి స్వామి, తాడ్వాయి కిషన్, మొదలగు రైతుల చేనులలో మొక్కజొన్న కంకులను తినేసి, తొక్కి నాశనం చేశాయి. అడవి పందుల దాడి వలన పంటకు తీవ్ర నష్టం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు స్పందించి పంట నష్టాన్ని ఇవ్వాలని కోరారు.