వ్యవసాయ పనులు అంటే అత్యధిక శ్రమ చేసేది గ్రామీణ మహిళలే. సూర్యోదయంతో పొలాలకు పరుగులు తీసేది పల్లెపడుచులే. అటువంటి వీరికి వేతన చెల్లింపుల్లో వివక్ష చూపిస్తున్నారు. పురుషులతో సమానంగా శ్రమిస్తున్నా ఇచ్చే కూలీలో అసమానతే చూపిస్తున్నారు. స్త్రీని వస్తువుగా చూస్తున్న భావజాలం గ్రామీణ ప్రాంతాల్లో అధికం. అందుకే ఇంటా, బయటా మహిళలు వేధింపులు, అత్యాచారాలు, హత్యాచారాలకు గురవుతుంటారు. వీటిని అరికట్టేలా స్థానిక గ్రామ పంచాయతీలు భద్రత కల్పించాలి.