'పల్లెలు దేశానికే పట్టుకొమ్మలు' అన్నారు గాంధీ. ఆ పల్లెల్లో స్త్రీ భాగస్వామ్యం లేకపోతే పరిపూర్ణం కాదు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధించినా, చంద్ర మండలంలోకి వెళ్లి వస్తున్నా, సమాజంలో సగంగా ఉండి, పురుషుల శ్రమకు జోడయితేనే అభివృద్ధి సాధ్యం. అమాయకత్వం, ఐక్యమత్యం, ఆలోచనాతత్వం కలగలిసినదే గ్రామీణ మహిళల శ్రమైక జీవన సౌందర్యం. ఉత్పత్తిలో, ఆర్థికాభివృద్ధిలో గ్రామీణ మహిళల భాగస్వామ్యం సగానికిపైనే. నేడు అంతర్జాతీయ గ్రామీణ మహిళల దినోత్సవం సందర్భంగా వారిని స్మరించుకుందాం.