
నిజామాబాద్: పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
కోటగిరి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన రమేష్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్టు ఎస్ఐ సందీప్ తెలిపారు. మృతుడు చాతి నొప్పి భరించలేక పరుగుల మందు తాగాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మరణించాడు. అతని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు.