నందిపేట్ ప్రభుత్వ ఆసుపత్రిలో వృద్ధాప్య వైద్య శిబిరం
నందిపేట్ మండల కేంద్రంలో ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల ఆధ్వర్యంలో వృద్ధాప్య వైద్య శిబిరాన్ని శుక్రవారం నిర్వహించారు. జిల్లా ఆయుష్ విభాగం డా. వందనా రెడ్డి ధన్వంతరి విగ్రహానికి పూలమాలలు వేసి శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం వృద్ధులకు వివిధ వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డా. నీలిమ, ఫార్మ సిస్ట్ వింధ్య, పోశెట్టి, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.