మైలారంలో డ్రైడే ఫ్రైడే కార్యక్రమం
నసరుల్లాబాద్ మండలం మైలారం గ్రామంలో శుక్రవారం డ్రై డే ఫ్రైడే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ఇంటి పరిసరాలలో నిల్వగల నీటిని పారబోయించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ సూర్యకాంత్, తదితరులు పాల్గొన్నారు.