కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండల పరిషత్ కార్యాలయం ముందు గురువారం తెలంగాణ పంచాయతీ సెక్రటరీ ఫెడరేషన్
రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు నల్గొండ జిల్లా మిత్రులకు మద్దతుగా, వారికి సంఘీభావం తెలుపుతూ గురువారం నల్లబ్యాడ్జి ధరించి పంచాయతీ కార్యదర్శులు విధులకు హాజరు కావడం జరిగింది. తిరిగి వారిని విధుల్లోకి తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శులు డిమాండ్ చేశారు.