నిజామాబాద్ రూరల్ మండలం - Nizamabad Rural Mandal

నిజామాబాద్ జిల్లా
కార్మిక లోకాన్ని కాంగ్రెస్ కాపాడుకుంటుంది: ఎంపీ అభ్యర్థి నీలం మధు
May 02, 2024, 04:05 IST/

కార్మిక లోకాన్ని కాంగ్రెస్ కాపాడుకుంటుంది: ఎంపీ అభ్యర్థి నీలం మధు

May 02, 2024, 04:05 IST
శ్రామిక దోపిడీ, అణచివేతకు గురవుతున్న కార్మిక లోకాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ముందు వరుసలో ఉంటదని మెదక్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు అన్నారు. మేడేను పురస్కరించుకొని శ్రీ కన్వెన్షన్ హాలులో బుధవారం INTUC ఆధ్వర్యంలో ఆ యూనియన్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కొలుకూరి నరసింహారెడ్డి అధ్యక్షతన మెదక్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎంపీ అభ్యర్థి నీలం మధు హాజరై మాట్లాడారు. కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేసి, వారికి అనుకూలంగా ఉన్నా వారికి కట్టబెట్టాలని చూస్తున్నారని తెలిపారు. అలాగే కార్మిక చట్టాలన్నింటినీ రద్దుచేసి, కొత్త కార్మిక చట్టాలను తెచ్చి యూనియన్ పెట్టుకునే హక్కును, సమ్మె చేసే హక్కులను కాలరాశి ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. మరోవైపు ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరం చేసే దిశగా మోదీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. తద్వారా ఉద్యోగులతో పాటు కార్మిక లోకానికి తీవ్ర అన్యాయం జరిగే పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ సర్కారు విధానాలను తిప్పి కొట్టేందుకు కార్మికుల తరఫున కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా వారికి అండగా నిలుస్తుందని పేర్కొన్నారు.