మహారాష్ట్రలో బిజెపి కూటమి ఘన విజయం సాధించడంతో నవీపేట్ మండల కేంద్రంలో బిజెపి శ్రేణులు టపాకాయలు కాల్చి శనివారం సంబరాలు చేసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పాలనతో పాటు మహారాష్ట్రలో బిజెపి కూటమి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుండడంతో ప్రజలు తిరిగి బిజెపికి పట్టం కట్టారని అన్నారు. భవిష్యత్తులో తెలంగాణలో సైతం బిజెపి విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.