తూంపల్లి గ్రామంలో హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెడి కవర్ హాస్పిటల్ వారిచే శనివారం ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించినట్లు ఫౌండేషన్ సభ్యులు తెలియజేశారు.
ఉచిత ఆరోగ్య శిబిరంలో ఉచిత వైద్యం, ఉచిత పరీక్షలు, ఉచితంగా మందులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బాలమణి-మల్లేష్, ఉప సర్పంచ్ నాగవ్వ, హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.