జక్రాన్ పల్లి: అదుపుతప్పి కారు బోల్తా

78చూసినవారు
జక్రాన్ పల్లి: అదుపుతప్పి కారు బోల్తా
జక్రాన్ పల్లి మండలం చింతలూరు సమీపంలో మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మనోహరాబాద్ గ్రామానికి చెందిన రాహుల్ అనే యువకుడు తన వ్యక్తిగత పనుల పై వేల్పూర్ మండలం అక్లూరు వైపు వెళ్తున్నాడు. చింతలూరు సమీపంలో అదుపుతప్పి కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణహాని జరగలేదు. వ్యవసాయ క్షేత్రాల్లో ఉన్న రైతులు పరుగున వచ్చి క్షతగాత్రుడిని సాయం అందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్