పుట్టినరోజే ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గూపన్పల్లిలో జరిగింది. మాంతం పవన్ (24) ఓ బార్‌లో కౌంటర్ బాయ్ గా పని చేస్తున్నాడు. సోమవారం ఉదయం తన పుట్టినరోజు సందర్భంగా స్నేహితులను కలిసి రాత్రికి వేడుకలకు హాజరవుతానని చెప్పి ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్‌హెచ్‌వో ఆరీఫ్ తెలిపారు.