ఇందల్వాయి నల్లవెల్లి గ్రామంలో గ్రామ పెద్దల సమక్షంలో సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతగానో ఉపయోగపడుతుందని సొసైటీ ఛైర్మెన్ నోముల శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మండలంలోని నల్లవెల్లి గ్రామంలో 7 గురుకి 1,87,000 రూపాయల చెక్కులను లబ్దిదారులకు గురువారం అందజేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ఛైర్మెన్ నోముల శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ దండ్ల రాజు, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు సుమన్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.