నిజామాబాద్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు జక్రాన్పల్లి మండలం పడ్కల్ గ్రామంలో మెడికేర్ సర్వీసెస్ లొ వివిధ ఎక్సైజ్ స్టేషన్, పరిదిలలో ఎన్డిపిఎస్ కేసులలో ఉన్నట్లువంటి రూ. 3. 5 కోట్ల విలువైన ఎండు గంజాయి దహనం చేసారు. దీనిలో 1007. 02 కిలోల ఎండు గంజాయి, 7కిలోల డైజో ఫామ్, 8 కేజీల అల్ఫాజోలం, 35 కేజీల గంజాయి చాక్లెట్లు, 2 గంజాయి మొక్కలను ఉన్నాయన్నారు.