ఛలో కలెక్టరేట్ ను జయప్రదం చేయాలని ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్ అన్నారు. సోమవారం మున్సిపల్ కార్మికుల చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కోటగల్లిలోని శ్రామిక భవన్ వద్ద ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కే.రాజేశ్వర్, గోవర్థన్, శివకుమార్, కిరణ్, కళావతి, రవి, లక్ష్మి, శంకర్ తదితరులు పాల్గొన్నారు.