తెలంగాణలో 11 నెలల కాంగ్రెస్ పాలనలో 42 మంది విద్యార్థులు చనిపోవడం ఆవేదన కలిగిస్తుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. అసిఫాబాద్(D) వాంకిడి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో కలుషితాహారం తిని అస్వస్థతకు గురై నిమ్స్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థిని శైలజను పరామర్శించి మాట్లాడారు. 'విద్యార్థుల కోసం సీఎం కనీసం 10 నిమిషాలైనా సమయం కేటాయించాలి. మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి' అని డిమాండ్ చేశారు.