నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ పతాకాన్ని ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రామకృష్ణ ఆవిష్కరించారు. క్రీడా పోటీల్లో గెలుపొందిన జర్నలిస్టులకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి శేఖర్, ఉపాధ్యక్షులు గోవిందరాజు, ఆర్గనైజర్ సెక్రెటరీ మండే మోహన్, సందీప్, రవిబాబు, సదానందం, రవికుమార్, పరమేశ్వర్ పాల్గొన్నారు.