APSRTC ఉద్యోగులకు శుభవార్త.. ఒక్కొక్కరికి రూ.10 లక్షలు!

66చూసినవారు
APSRTC ఉద్యోగులకు శుభవార్త.. ఒక్కొక్కరికి రూ.10 లక్షలు!
AP: కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు APSRTC శుభవార్త చెప్పింది. వారికి ఒక్కొక్కరికి రూ.10 లక్షల ప్రమాద బీమా కల్పిస్తున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి ఉద్యోగులు రూ.499 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అంత్యోదయ శ్రామిక సురక్ష యోజన (ASSY) పథకం ద్వారా ఆర్టీసీ యాజమాన్యం ఈ బీమాని అమలు చేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాల అధికారులకు ఆదేశాలు పంపింది. ఇవాళ్టి నుంచి బీమా ప్రీమియం చెల్లింపులు మొదలవుతాయి.

సంబంధిత పోస్ట్