TG: సికింద్రాబాద్ నుంచి కుంభమేళా జరుగుతున్న ప్రయాగ్‌రాజ్ మీదుగా దానాపూర్ వెళ్లాల్సిన 12791 నంబరు రైలును రైల్వేబోర్డు రద్దు చేసింది. ఇది బుధవారం ఉదయం 9.25 గంటలకు బయల్దేరాల్సి ఉండగా మంగళవారం రాత్రి 7.35 గంటలకు.. అంటే దాదాపు 14 గంటల ముందు రద్దు చేస్తున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. 21న దానాపూర్ నుంచి SECకు రావాల్సిన 12792 నంబరు రైలునూ ‘ఆపరేషనల్’ కారణంతో రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. దీంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.