ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఎన్నికల సంఘం బిగ్ షాకిచ్చింది. జగన్ గుంటూరు పర్యటనకు అనుమతి నిరాకరించింది. MLC ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఆయన పర్యటనకు అనుమతి నిరాకరిస్తున్నట్టు స్పష్టం చేసింది. కాగా, జగన్ రేపు ఉదయం 10.30 గంటలకు గుంటూరులోని మిర్చి యార్డుకు వెళ్లి రైతులను కలవనున్నట్టు వైసీపీ ఇప్పటికే తెలిపింది. ఈ క్రమంలోనే ఈసీ అనుమతి నిరాకరించింది.