వల్లభనేని వంశీ అరెస్టే లక్ష్యంగా చంద్రబాబు సర్కార్ కుట్రలు చేసిందని వైసీపీ ఆరోపిస్తూ 'బిగ్ బ్లాస్ట్' అంటూ ఎక్స్ లో పోస్ట్ చేసింది. అందుకు ఇదే నిదర్శనం అంటూ కోర్టు ముందు సత్యవర్థన్ ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను విడుదల చేసింది. టీడీపీ ఆఫీసుపై దాడి ఘటన జరిగిన సమయంలో తాను అక్కడలేనని సత్యవర్థన్ స్టేట్‌మెంట్ ఇచ్చాడని వైసీపీ పేర్కొంది. తనను ఎవరూ బలవంతం పెట్టలేదని కూడా సత్యవర్థన్ కోర్టులో వెల్లడించాడని స్పష్టం చేసింది.