పాండ్య లేకపోయినా గుజరాత్ టైటాన్స్‌కు పెద్ద నష్టం లేదు’

582చూసినవారు
పాండ్య లేకపోయినా గుజరాత్ టైటాన్స్‌కు పెద్ద నష్టం లేదు’
హార్దిక్‌ గుజరాత్‌ను వీడటంపై ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్‌ బ్రాడ్‌ హాగ్‌ స్పందించాడు. పాండ్య వెళ్లినా గుజరాత్ టైటాన్స్‌కు పెద్దగా నష్టం లేదన్నాడు. హార్దిక్‌ లేకున్నా టైటాన్స్‌ బలంగానే ఉందని పేర్కొన్నాడు. ‘‘హార్దిక్ పాండ్య మిడిల్‌ ఆర్డర్‌లో నాణ్యమైన ఆల్‌రౌండర్‌. కానీ, హార్దిక్‌ లేని లోటును పూడ్చుకోగలదు. ముంబయి తరపున తన అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తాడని భావిస్తున్నా’’ అని బ్రాడ్ హాగ్ వివరించాడు.

సంబంధిత పోస్ట్