బర్త్‌డే వేడుకలు వద్దు.. అభిమానులకు విజయ్‌ విజ్ఞప్తి

71చూసినవారు
బర్త్‌డే వేడుకలు వద్దు.. అభిమానులకు విజయ్‌ విజ్ఞప్తి
తమిళనాడు కళ్లకురిచ్చిలో కల్తీసారాకు 55 మంది దాకా ప్రాణాలు కోల్పోయి రాష్ట్రం శోకసంద్రంగా మారటంతో శనివారం తన పుట్టిన రోజు వేడుకలు జరుపరాదని, అవసరమైతే బాధిత కుటుంబాలకు సాయం చేసి ఆదుకోవాలని తమిళగ వెట్రి కళగం నాయకుడు, ప్రముఖ సినీనటుడు విజయ్‌ తన అభిమానులకు విజ్ఞప్తి చేశారు. అభిమానులు తన జన్మదిన వేడుకల సందర్భంగా ఎలాంటి ఆడంబరాలకు పోవద్దని సూచించారు. ప్రస్తుతం కల్తీసారా బాధితులను ఆదుకోవడమే అందరి కర్తవ్యమన్నారు.

సంబంధిత పోస్ట్