విశాఖ-సికింద్రాబాద్‌ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ఆలస్యం

80చూసినవారు
విశాఖ-సికింద్రాబాద్‌ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ఆలస్యం
విశాఖ-సికింద్రాబాద్‌ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను సాంకేతిక సమస్యలు వెంటాడుతున్నాయి. తాజాగా విశాఖ నుంచి సికింద్రాబాద్‌కు రావాల్సిన వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లోని C-9 కోచ్‌లో సాంకేతికత లోపం తలెత్తింది. దీంతో సర్వీసు 4 గంటలు ఆలస్యంగా నడుస్తుందని అధికారులు ప్రకటించారు. ఉదయం 5.45 గంటలకు బయల్దేరాల్సిన రైలు ఉదయం 10 గంటలకు స్టార్ట్‌ అవుతుందని చెప్పారు.

సంబంధిత పోస్ట్