మణిపూర్ సందర్శించేందుకు ప్రధానికి తీరిక లేదా?

58చూసినవారు
మణిపూర్ సందర్శించేందుకు ప్రధానికి తీరిక లేదా?
మణిపూర్ లో చెలరేగిన జాతి ఘర్షణల సమస్యపై కాంగ్రెస్ మరోసారి స్పందించింది. ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ ప్రధాని నరేంద్రమోడీపై ఫైర్ అయ్యారు. మణిపూర్ ప్రాంత ప్రజల్ని మోడీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. అన్నింటికి ప్రధాని మోడీకి సమయం ఉంటుంది కానీ మణిపూర్ సందర్శించేందుకు తీరిక దొరకడం లేదని విమర్శించారు. కనీసం ఆ సమస్య పరిష్కారానికి ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యేందుకు సిద్ధంగా లేరని ఎక్స్ వేదికగా ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్