తాజాగా బ్రెజిల్‌లో తండ్రీకొడుకులు విమానాన్ని నడుపుతున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అయితే తండ్రి బీరు తాగుతుండగా.. 11 ఏళ్ల కొడుకు ఆ విమానాన్ని నడుపుతున్న వీడియో ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. ఆ తండ్రీకొడుకులు విమానం ప్రమాదంలో మరణించారు. జూలై 29వ తేదీన జరిగిన ప్రమాదంలో.. 42 ఏళ్ల గేరన్ మాయా, అతని కుమారుడు ఫ్రాన్సిస్‌కో మాయా ప్రాణాలు కోల్పోయారు.