వాటర్ ట్యాంక్ కూలి.. బాలికతో సహా ఇద్దరు మృతి

71చూసినవారు
యుపిలోని మథురలో ఘోర ప్రమాదం జరిగింది. బిఎస్‌ఎ ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో గంగా వాటర్ ప్రాజెక్ట్ కింద నిర్మించిన 2.5 లక్షల లీటర్ల ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంక్ కుప్పకూలింది. శిథిలాలు పడటంతో బాలిక సరితా గోస్వామితో సహా ఇద్దరు మృతి చెందారు. కాగా 15 మందికి పైగా గాయపడ్డారు. ఇప్పటికీ చాలా మంది శిథిలాల కింద కూరుకుపోయి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. డజనుకు పైగా వాహనాలు శిథిలాల కింద చిక్కుకున్నాయి. రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్