ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఓ రాజకీయ పార్టీని ప్రారంభిస్తున్నారు. వచ్చే బీహార్ ఎన్నికలే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఆయన.. తన పార్టీకి ‘జన్ సూరజ్' అనే పేరు పెట్టారు. "అక్టోబర్ 2న నేను రాజకీయ పార్టీని పెట్టడం లేదు. లాలూ ప్రసాద్, నితీష్ ను వదిలించుకోవడానికి బీహార్ ప్రజలు పార్టీ పెడుతున్నారు. ఇప్పటి వరకు రాజకీయ పార్టీలకు సూచనలిచ్చాను. ఇప్పుడు బీహార్ ప్రజలకిస్తాను”అని అన్నారు.