శశిథరూర్‌కు నోటీసు

64చూసినవారు
శశిథరూర్‌కు నోటీసు
తిరువనంతపురం లోక్‌సభ నియోజక వర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి శశిథరూర్‌కు బిజెపి అభ్యర్థి రాజీవ్ చంద్రశేఖర్ బుధవారం పరువు నష్టం నోటీసును పంపించారు. కీలక ఓటర్లకు, క్రైస్తవ పారిష్ పాస్టర్లు వంటి ప్రభావవంతమైన వ్యక్తులకు తాను లంచం ఇస్తున్నట్లు శశిథరూర్ ఆరోపించారన్నారు. తప్పుదోవ పట్టించే సమాచారాన్ని ప్రచారం చేశారని చంద్రశేఖర్ పేర్కొన్నారు. బేషరతుగా బహిరంగ క్షమాపణలు చెప్పాలని నోటీసులో పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్