39,481 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

78చూసినవారు
39,481 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) 39,481 జీడీ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. ఇవాళి నుంచి అక్టోబర్ 14వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. BSF, CISF, CRPF, SSB, SSF, ITBP, అస్సాం రైఫిల్స్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోలో పోస్టులు భర్తీ కానున్నాయి. టెన్త్ పాసైన 18-23 ఏళ్లలోపు వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. నవంబర్ 5-7 వరకు దరఖాస్తుల్లో మార్పులు చేసుకోవచ్చు. 2025 జనవర్- ఫిబ్రవరి మధ్య పరీక్షలు జరుగుతాయి. వెబ్ సైట్: https://ssc.gov.in/login

సంబంధిత పోస్ట్