NPS వాత్సల్య.. చిన్నారుల కోసం దీర్ఘకాలిక పొదుపు పథకం

80చూసినవారు
NPS వాత్సల్య.. చిన్నారుల కోసం దీర్ఘకాలిక పొదుపు పథకం
ఎన్‌పీఎస్‌ వాత్సల్య పథకాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా ప్రారంభించారు. తమ పిల్లల భవిష్యత్‌ కోసం దీర్ఘకాలం పెట్టుబడి పెట్టాలనుకునే వారి కోసం దీన్ని తీసుకొచ్చినట్లు వెల్లడించారు. 18 ఏళ్లలోపు బాలబాలికల పేరుతో తల్లిదండ్రులు/సంరక్షకులు ఈ ఖాతా తీసుకోవచ్చు. పిల్లలు మేజర్లు అయ్యాక ఈ ఖాతా సాధారణ ఎన్‌పీఎస్‌ టైర్‌- 1 ఖాతాగా మారుతుంది. ఎన్‌పీఎస్‌ ఖాతా తెరవాలంటే కనిష్ఠంగా రూ.1,000తో మదుపు ప్రారంభించొచ్చు. గరిష్ఠంగా ఎంతవరకైనా మదుపు చేసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్