చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో ఉన్న ప్రముఖ రెస్టరెంట్ కస్టమర్లు మిగిల్చిన చిల్లీ ఆయిల్ సూప్స్, ఇతర ఆహార పదార్థాలను రీసైక్లింగ్ చేస్తోంది. దాని నుంచి నూనె సేకరించి సూప్‌లో కలిపి కొత్త కస్టమర్లకు వడ్డిస్తోంది. దానికి సలైవా ఆయిల్‌గా పేర్కొంటున్నట్లు తెలిసింది. ఈ తతంగాన్ని అధికారుల దృష్టికి ఓ కస్టమర్ తీసుకెళ్లడంతో ఈ వ్యవహారం బయటపడింది. తప్పు అంగీకరించిన హోటల్ యజమాని.. ఫుడ్ ఫ్లేవర్ కోసమే ఇలా చేస్తున్నట్లు చెప్పడం గమనార్హం.