విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులపై అధికారులతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం సమీక్ష నిర్వహించారు. రెండు నగరాల్లో డబుల్ డెక్కర్ విధానంలో 25 కి.మీ మేర మెట్రో నిర్మాణం చేపట్టనున్నారు. డబుల్ డెక్కర్ విధానం అమలు చేయబోతున్న ఈ ప్రాజెక్టుకు నిధుల సమీకరణ తదితర అంశాలపై చర్చించారు. ఈ సమీక్షలో మంత్రులు శ్రీ పి.నారాయణ, శ్రీ బిసి జనార్థన్ రెడ్డి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.