విజయవాడ పుస్తకమహోత్సవంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతుండగా OG.. OG.. అంటూ ఫ్యాన్స్ నినాదాలు చేశారు. కాగా, OG.. OG.. అని అనేకంటే శ్రీశ్రీ.. శ్రీశ్రీ అనండి అని పవన్ వారికి సలహా ఇచ్చారు. నేను మీకు ప్రాణం అయ్యే స్థాయికి వచ్చాను అంటే పుస్తకాల ప్రభావమే కారణం అని అన్నారు. యూత్ అంతా పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలన్నారు. పుస్తకం ద్వారా వచ్చే శక్తి జ్ఞానం వేరు.. చీకటిలో ఉనప్పుడు పుస్తకం ఓ దారి చూపిస్తుందని పవన్ అన్నారు.