ఉత్తరప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడా బుధవారం ఉదయం షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. అక్కడ వెస్ట్‌లోని స్టెల్లార్ జీవన్ సొసైటీ ఎదురుగా ఉన్న పార్కులో నడుచుకుంటూ వెళ్తున్న వృద్ధుడిని కాల్చి చంపారు. అనంతరం బైకుపై దుండగలు పారిపోయినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.