మరోసారి క్షీణించిన ఫోరెక్స్ నిల్వలు

77చూసినవారు
మరోసారి క్షీణించిన ఫోరెక్స్ నిల్వలు
విదేశీ మారకపు నిల్వలు మరోసారి క్షీణించాయి. ఏప్రిల్ 19 నాటికి $2.83 బిలియన్లు తగ్గి $640.33 బిలియన్లకు చేరినట్లు ఆర్బీఐ వెల్లడించింది. మరోవైపు కరెన్సీ అసెట్స్ $3.79 బిలియన్లు తగ్గి $560.86 బిలియన్లకు క్షీణించింది. కాగా అంతకుముందు వారం (ఏప్రిల్ 12 నాటికి) ఫోరెక్స్ నిల్వలు $5.4 బిలియన్లు తగ్గి $643.16 బిలియన్లుగా నమోదైంది. అయితే బంగారం నిల్వలు మాత్రం $1.01 బిలియన్లు పెరిగి $56.82 బిలియన్లకు చేరాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్