హర్షిత్ రాణాపై ఒక మ్యాచ్ నిషేధం

77చూసినవారు
హర్షిత్ రాణాపై ఒక మ్యాచ్ నిషేధం
కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్ హర్షిత్ రాణాకు ఐపీఎల్ యాజమాన్యం షాకిచ్చింది. ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందున 100% మ్యాచ్ ఫీజు జరిమానా విధించడంతో పాటు ఒక మ్యాచ్ ఆడకుండా నిషేధించింది. గతంలో ఎస్ఆర్‌హెచ్ ప్లేయర్ మయాంక్ అగర్వాల్‌ను ఔట్ చేసిన తర్వాత ఫ్లయింగ్ కిస్‌లు ఇస్తూ రెచ్చగొట్టడంతో అతని మ్యాచ్ ఫీజులో 60% కోత విధించిన విషయం తెలిసిందే. ఆదివారం డీసీతో మ్యాచ్‌లోనూ అనుచితంగా ప్రవర్తించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్