ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ OpenAI సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ గొప్ప మనసును చాటుకున్నారు. తాజాగా బిలియనీర్ల జాబితాలో చేరిన ఆయన.. తన సంపదలో పెద్ద మొత్తాన్ని సమాజానికి తిరిగి ఇస్తానని ప్రకటించారు. తన భాగస్వామి ఆలివర్ మల్హెరిన్‌తో కలిసి ‘ది గివింగ్ ప్లెడ్జ్’ దాతృత్వ కార్యక్రమంపై సంతకం చేశారు. నవీన సమాజ నిర్మాణానికి సాయం చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆల్ట్‌మన్ తెలిపారు.