ఆపరేషన్‌ ’స్మైలింగ్‌ బుద్ధా‘

77చూసినవారు
ఆపరేషన్‌ ’స్మైలింగ్‌ బుద్ధా‘
నేటికి 50 సంవత్సరాల క్రితం, 1974లో రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో తొలిసారిగా అణు పరీక్షను విజయవంతంగా నిర్వహించి భారతదేశం ఒక చారిత్రాత్మక మైలురాయిని చేరుకుంది. ఈ అణు పరీక్షకు ‘ఆపరేషన్‌ స్మైలింగ్‌ బుద్ధా’ అని పేరు పెట్టారు. బుద్ధ జయంతి కూడా అదే రోజు కావడంతో ఈ పేరు ఖరారు చేశారు. విదేశీ వ్యవహారాల శాఖ మాత్రం దీన్ని పోఖ్రాన్‌-1గా నామకరణం చేసింది. ప్రపంచ దేశాల్లో ఆగ్రహావేశాలను చల్లార్చడానికి ఈ పరీక్షను ‘శాంతియుత అణు విస్ఫోటం’గా ఇందిర అభివర్ణించారు.

సంబంధిత పోస్ట్