కల్తీసారా ఘటనపై అసెంబ్లీలో విపక్షాల ఆందోళన

50చూసినవారు
కల్తీసారా ఘటనపై అసెంబ్లీలో విపక్షాల ఆందోళన
తమిళనాడు అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. కల్తీసారా మృతుల ఘటనపై విపక్షాలు ఆందోళన చేపట్టాయి. డీఎంకే ఆధ్వర్యంలోనే సారా విక్రయాలు జరుగుతున్నాయని ఆరోపించాయి. అసెంబ్లీలో మృతులకు సంతాప తీర్మానం ప్రకటించిన అనంతరం సభ రేపటికి వాయిదా పడింది. కాగా, కల్తీసారా ఘటనలో ఇప్పటివరకు 39 మంది మరణించారు. ఈ ఘటనపై సీఎం స్టాలిన్.. ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమణియన్, డీజీపీ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్