‘ఒసాకా తమిళ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్’ అవార్డుల విజేతల జాబితా విడుదలైంది. ‘విక్రమ్’ ఉత్తమ చిత్రంగా నిలిచింది. అందులో ప్రధాన పాత్ర పోషించిన కమల్ హాసన్ ఉత్తమ నటుడిగా, కీర్తి సురేష్ ‘సాని కాయితం’ చిత్రానికిగానూ ఉత్తమ నటిగా నిలిచారు. ఉత్తమ దర్శకుడి పురస్కారానికి మణిరత్నం (పొన్నియిన్ సెల్వన్ 1 చిత్రం), ఉత్తమ సంగీత దర్శకుడి పురస్కారానికి అనిరుధ్ (విక్రమ్ సినిమా) ఎంపికయ్యారు.