ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లపై దువ్వాడ శ్రీనివాస్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. ఓ ఛానల్ ఇంటర్వ్యూలో దువ్వాడ మాట్లాడుతూ.. ‘పరిస్థితులు, ప్రభావాలు ఇలాంటి స్థితులకు దారి తీస్తుంటాయని అర్థమైంది. పవన్ చెప్పకుండా పెళ్లి చేసుకున్నారు. నేను ప్రజలకు నా మొదటి జీవితం ఇది, ఇది నా రెండో జీవితమని చెప్పాను. పవన్‌కు నాకు పోలిక లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరి వ్యక్తిగత విషయాలు మాట్లాడకపోవడమే మంచిది.’ అని అన్నారు.