గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 4న ఏపీలోని రాజమండ్రిలో జరగనుంది. ఈ ఈవెంట్‌కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్‌గా హాజరు కానున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ క్రమంలో దీనికి సంబంధించి పోస్టర్‌ను రిలీజ్ చేసింది. గేమ్ ఛేంజర్ సినిమా తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఈ నెల 10న విడుదల కానుంది.