ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీడియా చిట్‌చాట్‌లో OG సినిమా గురించి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. 'ఓజీ 1980-90ల మధ్య జరిగే కథ. OG అంటే ఒరిజినల్ గ్యాంగ్ స్టర్. అభిమానులు ఓజీ ఓజీ అని అరుస్తుంటే.. అవి నాకు బెదిరింపుల్లాగా అనిపిస్తున్నాయి. నేను ఒప్పుకున్న అన్ని సినిమాలకు డేట్స్ ఇచ్చినా చిత్ర బృందాలు సద్వినియోగం చేసుకోలేదు. హరిహర వీరమల్లు ఎనిమిది రోజుల షూటింగ్ మాత్రమే ఉంది' అని పవన్ తెలిపారు.