ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంపై ప్రశ్నించకుండా ఉండేందుకు పవన్‌కు సీఎం చంద్రబాబు నెలకు రూ.50 కోట్లు లంచం ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. సూపర్ సిక్స్ అమలు గురించి పవన్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. లంచం సొమ్ము తిని పవన్ గొంతు మూగబోయిందని విమర్శించారు. పవన్ ఎందుకు ప్రశ్నించడం లేదో జనసైనికులు అడగాలని, మేం ఏదైనా తప్పు చేస్తే నిర్భయంగా జైల్లో పెట్టొచ్చని తెలిపారు.