నటుడు రాజేంద్రప్రసాద్ కుమార్తె గాయత్రి మృతి పట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శనివారం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘గాయత్రి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. రాజేంద్రప్రసాద్, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. రాజేంద్రప్రసాద్‌కు మనోధైర్యాన్ని ఇవ్వాలని దేవుడిని కోరుకుంటున్నాను.’ అని పవన్ సంతాపం తెలిపారు.