చాలా మంది అమ్మాయిలు సాయంత్రం అయిందంటే పానీపూరీ తినేందుకు ఇష్టపడతారు. అయితే పానీపూరీ అధికంగా తినడం వల్ల అనర్థాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. దీని వల్ల PCOD సమస్యలు ఎక్కువ అవుతున్నట్లు వైద్యులు గుర్తించారు. రుతుక్రమం సక్రమంగా లేకపోవడం, బరువు పెరగడం, పెదవులపై రోమాలు వంటి సమస్యలు ఎదురవుతాయని పేర్కొంటున్నారు. పానీపూరీలో నీరు శుభ్రంగా లేకుంటే జ్వరాల బారిన పడతారని హెచ్చరిస్తున్నారు.