జగిత్యాల: టపాసుల విక్రయానికి లైసెన్సు తప్పనిసరి: ఎస్పీ
దీపావళి పండుగను పురస్కరించుకొని టపాసులు విక్రయించేవారు లైసెన్స్ పొంది నిబంధన మేరకే షాపులు ఏర్పాటు చేసుకోవాలని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో సూచించారు. ఎలాంటి అగ్ని ప్రమాదాలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దుకాణాలు ఏర్పాటు చేసే ప్రదేశంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బహిరంగ ప్రదేశాలలో మాత్రమే టపాకాయల షాపుల ఏర్పాటు చేసుకోవాలన్నారు.