నేటి కాలంలో బాలికలకు చదువు ఎంతో ముఖ్యమైనదని, క్రమశిక్షణతో కూడిన చదువే ఉన్నత శిఖరాలకు చేరుస్తుందని పెద్దపల్లి జిల్లా ఇంటర్ విద్యాధికారిని కల్పన అన్నారు. మంగళవారం మంథని లోని బాలికల జూనియర్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆమె మాట్లాడుతూ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లలను కళాశాలకు పంపిస్తున్నారని, వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ముందుకు సాగాలన్నారు. విద్యార్థి జీవితంలో ఇంటర్ దశ ఎంతో కీలకంగా ఉంటుందన్నారు.