అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ
అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ వర్తింపజేస్తామని, ఎవరూ ఆందోళన చెందవద్దని పరిగి ఎమ్మెల్యే డాక్టర్ రామ్మోహన్ రెడ్డి తెలిపారు. శుక్రవారం మహమ్మదాబాద్ మండల కేంద్రంలో రుణమాఫీ, ప్రభుత్వ పథకాలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. అర్హులైన ప్రతిఒక్కరికీ రుణమాఫీ చేసి తీరుతామన్నారు. అర్హులైన లబ్దిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు.